KTR: అవార్డులు వస్తుంటే.. గర్వంగా ఉంది

KTR: ప్రజలు కేసిఆర్ ముఖ్యమంత్రి కాలేదన్నది జీర్ణించుకోలేకపోతున్నారు

Update: 2024-01-16 13:59 GMT

KTR: అవార్డులు వస్తుంటే.. గర్వంగా ఉంది

KTR: రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సర్పంచ్ లకు ఆత్మీయ సత్కారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరితో కరాచాలనం చేస్తూ, అందరినీ హుషారుగా పలకరించారు. ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్న సర్పంచులను శాలువాలతో సత్కరించారు కేటీఆర్. వారితో కలసి సహపంక్తి భోజనం చేశారు. పదవులు వస్తాయి, పోతాయి, పదవిలో ఉన్నప్పుడు ఎంత మంచిగా పనిచేశారన్నదే ముఖ్యం అన్నారు కేటీఆర్. పదవిలో ఉన్నప్పుడు అన్ని విధాలా మంచిగా పనిచేశారు కాబట్టే, ప్రజలు కేసిఆర్ ముఖ్యమంత్రి కాలేదన్నది జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు. 2014 నుండి ఇప్పటి వరకు పల్లె ప్రగతికి గాను తెలంగాణకు 82 అవార్డులు వచ్చాయన్నారు కేటీఆర్.

Tags:    

Similar News