Harish Rao: రాహుల్ గాంధీకి మాజీమంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ
Harish Rao: తెలంగాణలో అంబేద్కర్ రాజ్యాంగం నడవడం లేదు
Harish Rao: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాజీమంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో అంబేద్కర్ రాజ్యాంగం నడవడం లేదని.. అధికార దుర్వినియోగంతో దుర్మార్గ, దుష్టపాలన సాగుతోందని ఆరోపించారు. ప్రభుత్వం మానవత్వా్న్ని, న్యాయాన్ని బుల్డోజర్‌తో అణచివేస్తోందని విమర్శించారు. మూసీ రివర్ ఫ్రంట్, హైడ్రా పేరుతో పేద, మధ్యతరగతి కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారని.. తెలంగాణలో పౌరహక్కులను నిరంతరం ప్రభుత్వం ధిక్కరిస్తోందని లేఖలో పేర్కొన్నారు హరీశ్ రావు.
అందుకు మూసీ ప్రాజెక్టు, హైడ్రాపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని తెలిపారు హరీశ్ రావు రాజ్యాంగంలో పొందుపరచిన న్యాయసూత్రాలను, చట్టాలను గౌరవించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సలహా ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని తన లేఖ ద్వారా రాహుల్‌ను కోరారు హరీశ్ రావు.