తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మరో వివాదం
Telangana: తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మరో వివాదం, మోడీ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ రాకపోవడంతో తప్పుబడుతున్న బీజేపీ.
Telangana: తెలంగాణలో... బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మరో వివాదం రాజుకుంటోంది. ప్రధాని మోడీ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరుకాకపోవడాన్ని కమలం పార్టీ తప్పబడుతోంది. ప్రధాని రాష్ట్రానికి వస్తే.. రాలేనంత బీజీ సీఎంకు ఏముందని ప్రశ్నించింది. ఈ అంశాన్ని రాజకీయ వివాదంగా మలచుకోవడానికి కాషాయపార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రాజ్యాంగ హోదా పదవిలో ఉన్న కేసీఆర్.. మరోసారి రాజ్యాంగాన్ని అవమాన పరిచేలా వ్యవహరించారని బండి సంజయ్ ఆరోపించారు.
పశ్చింబెంగాల్, పంజాబ్ వలే.. తెలంగాణ సీఎం కూడా ప్రధాని నరేంద్రమోడీతో కయ్యానికి కాలు దువ్వుతోంది. సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగానే... ప్రధాని పర్యటనకు డుమ్మాకొట్టిన్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది. 4 నెలలుగా కేసీఆర్.. కేంద్రప్రభుత్వంపై బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అందుకే సీఎం కేసీఆర్ వ్యూహత్మకంగా తప్పుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటులో సీఎం కేసీఆర్ ముందు వరుసలో ఉన్నారు. త్వరలో 5రాష్ట్రాల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. మళ్లీ మోడీ కార్యక్రమానికి హాజరైతే.. రాజకీయ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని సీఎం కేసీఆర్ భావించినట్లు చర్చ నడుస్తోంది.