మానవత్వం చాటుకున్నా మాజీ ఎంపీ కవిత

నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడ్డాడు. అయితే అతను యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడడంతో అతన్ని స్థానిక ఆసుపత్రిలో చేర్చుకోలేదు.

Update: 2019-10-19 15:28 GMT


నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత మానవత్వం చాటుకున్నారు. ఆపదలో ఉన్న ఓ వ్యక్తికి సహాయం అందించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడ్డాడు. అయితే అతను యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడడంతో అతన్ని స్థానిక ఆసుపత్రిలో చేర్చుకోలేదు. దీనితో హైదరాబాదులోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడికి వైద్యానికి ఎక్కువ ఖర్చు అవడంతో పెట్టుకొనే స్థోమత లేదు. అయితే దీనిపైన సురేష్ అనే ఓ నెటిజన్.. అతడి బాధను వివరిస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. దీనిని గమనించిన మాజీ ఎంపీ కవిత వెంటనే స్పందించారు. తన కార్యాలయం ఫోన్ నెంబర్ అందించి ఆఫీసుకు ఫోన్ చేస్తే వారు చూసుకుంటారని భరోసా ఇచ్చారు.

Tags:    

Similar News