Etela Rajender: నిర్మల్ బహిరంగ సభలో ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు
Etela Rajender: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం: ఈటల
Etela Rajender: నిర్మల్ బీజేపీ బహిరంగ సభలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరపాలని అసెంబ్లీ వేదికగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నోసార్లు డిమాండ్ చేశామని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరపకపోవడం దుర్దినమని మండిపడ్డారు. 2023 లో బీజేపీ తెలంగాణాలో విజయదుందుభి మోగించి సెప్టెంబర్ 17 ను తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరుపుతామని ఈటల ప్రకటించారు.