Etela Rajender: ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల
Etela Rajender: మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
Etela Rajender: మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేసిన ఈటల.. అసెంబ్లీ కార్యదర్శికి రాజీనామాపత్రం సమర్పించారు. గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళ్ళులర్పించిన అనంతరం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మేట్‌లో ఉన్న తన రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి ఈటల అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. 17 ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగా అని ఇప్పుడు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.
తనను రాజీనామ చేయమని ప్రజలే ఆశీర్వదించారన్నారు. టీఆర్ఎస్ బీ ఫారం ఇచ్చి ఉండొచ్చు. కానీ గెలిపించింది ప్రజలు అని అన్నారు. అధికార దుర్వినియోగం చేసి ఉప ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. తనకు జైళ్లు, కేసులు కొత్త కాదని... తన డీఎన్ఏలోనే లౌకికవాదం ఉందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కొత్త పార్టీ పెట్టాలని చాలామంది శ్రేయోభిలాషులు తనను కోరారని వెల్లడించారు. సీఎం కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉందన్నారు.