Etela Rajender: అపోలో ఆస్పత్రి నుంచి బీజేపీ నేత ఈటల డిశ్చార్జ్

* దళిత బంధు హుజూరాబాద్‌ ఎన్నిక స్టంటే - ఈటల * సిద్ధాంతాలను పక్కనపెట్టి.. వేల కోట్లను కేసీఆర్‌ నమ్ముకున్నారు

Update: 2021-08-05 07:06 GMT

ఈటల రాజేందర్ (ఫైల్ ఫోటో)

Etela Rajender: హుజురాబాద్‌ ఎన్నికల స్టంటే దళిత బంధు పథకమని మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు బీజేపీ నేత ఈటల రాజేందర్. గత కొన్నిరోజులుగా అనారోగ్య కారణాలతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన.. ఇవాళ డిశ్చార్జ్‌ అయ్యారు. దళితులపై సీఎం కేసీఆర్‌ ది కపట ప్రేమన్న ఈటల సీఎంకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలోని దళితులందరికీ 10లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, హుజూరాబాద్‌ ఉపఎన్నికలో తనను ఓడించేందుకు కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారని తెలిపారు. ఇప్పటికే హుజూరాబాద్‌లో 150 కోట్ల నగదు పంచారని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌కు హుజూరాబాద్‌ ప్రజానీకానికంటే ఓట్లే ముఖ్యమని విమర్శించారు ఈటల.

Tags:    

Similar News