Errabelli Dayakar Rao: నాపై పోటీ చేసేందుకు కాంగ్రెస్‌లో అభ్యర్థులు లేరు
Errabelli Dayakar Rao: వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో మంత్రి ఎర్రబెల్లి ఎన్నికల ప్రచారం
Errabelli Dayakar Rao: తన మీద పోటీ చేసేందుకు కాంగ్రెస్‌లో అభ్యర్థులే లేరన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. విదేశాల నుంచి అరువుకు తెచ్చుకొని తమపై పోటీకి పెడుతున్నారని.. అంత దైన్య స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని ఎద్దేవా చేశారు. స్థానికంగా ప్రజలకు సేవ చేసే నాయకులను కాదని.... ఎన్నారైలకు ఓట్లు వేసే ప్రజలు పాలకుర్తిలో లేరరు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి ఎర్రబెల్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో గిరిజన మహిళలతో కలిసి దాండియా పాటలకు నృత్యాలు చేసి అలరించారు. పాలకుర్తిలో లక్ష మెజారిటీతో గెలుస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.