Telangana: ప్రచారాల పర్వం.. గెలుపే లక్ష్యంగా సుడిగాలి పర్యటలు చేస్తున్న మంత్రులు కేటీఆర్, హరీష్ రావు

Telangana: సంగారెడ్డి నియోజకవర్గంలో మంత్రి హరీష్ రావు ప్రచారం.. సూర్యాపేట, హూజూర్‌నగర్‌లో మంత్రి కేటీఆర్ రోడ్ షోలు

Update: 2023-11-23 05:17 GMT

Telangana: ప్రచారాల పర్వం.. గెలుపే లక్ష్యంగా సుడిగాలి పర్యటలు చేస్తున్న మంత్రులు కేటీఆర్, హరీష్ రావు

Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉండటంతో... ప్రచారాల జోరు పెంచారు గులాబీ బాస్ కేసీఆర్. రోజుకు నాలుగు సభల్లో ప్రచారాలు నిర్వహిస్తుూ.. గెలుపే లక‌్ష్యంగా దూసుకెళ్తున్నారు. ఈరోజు మహేశ్వరం, వికారాబాద్, జహీరాబాద్, పటాన్ చెరులలో ప్రజాఆశీర్వాదసభల్లో కేసీఆర్ పాల్గొననున్నారు.

మరోవైపు మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ సైతం ప్రచారాల్లో స్పీడ్ పెంచారు. సంగారెడ్డి నియోజకవర్గంలో మంత్రి హరీష్ రావు గౌడ ఆత్మయ సమ్మేళనం, మైనారటీ ఆత్మీయ సమ్మేళం కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సదాశివపేట పట్టంలో రోడ్ షో నిర్వహించనున్నారు.

ఇక మంత్రి కేటీఆర్ సూర్యాపేట, హుజూర్‌నగర్ నియోజకవర్గా్ల్లో రోడ్ షో నిర్వహించన్నారు. ముఖ్య నేతలతో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సాయంత్రం.. ఈసీఐఎల్, మల్లాపూర్‌లో భారీ ఎత్తున రోడ్ షో నిర్వహించనున్నారు.

Tags:    

Similar News