ED Rides: తెలంగాణ వ్యాప్తంగా ముగిసిన ఈడీ సోదాలు

ED Rides: 10 మెడికల్ కాలేజీల్లో సోదాలు చేసిన ఈడీ

Update: 2023-06-22 06:53 GMT

ED Rides: తెలంగాణ వ్యాప్తంగా ముగిసిన ఈడీ సోదాలు 

ED Rides: తెలంగాణ వ్యాప్తంగా ఈడీ సోదాలు ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా 10 మెడికల్ కాలేజీల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. సీట్ల కేటాయింపుల్లో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. సీట్లను బ్లాక్ చేసి ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారని ఈడీకి ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. వరంగల్‌లో నమోదయిన FIR ఆధారంగా ఈడీ అధికారులు విచారణ చేపట్టారు. మంత్రి మల్లారెడ్డి మెడికల్ కాలేజీ, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజీ, మేడ్చల్‌లోని మెడిసిటి మెడికల్ కాలేజీ, సంగారెడ్డిలోని MNR మెడికల్ కాలేజీ, బొమ్మకల్ చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీ, కామినేని మెడికల్ కాలేజీ, ప్రతిమ మెడికల్ కాలేజీ, డెక్కన్, SVS కాలేజీల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. 

Tags:    

Similar News