DK Aruna: నాకు అవకాశం కల్పిస్తే పాలమూరు అభివృద్ధికి బాటలు వేస్తా
DK Aruna: పాలమూరు పార్లమెంట్‌తో పాటు.. దేశంలో మరోసారి బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయం
DK Aruna: పాలమూరు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ దూసుకుపోతున్నారు. మహబూబ్‌నగర్ పట్టణంలోని వీరన్నపేటలో డీకే అరుణ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మోడీ చేసిన అభివృద్ది పనులను వివరిస్తూ కమలం పువ్వు గుర్తుకే ఓటు వేయాలని కోరారు. తనకు అవకాశం కల్పిస్తే పాలమూరు అభివృద్ధికి బాటలు వేస్తానని డీకే అరుణ అన్నారు. పాలమూరు పార్లమెంట్‌తో పాటు దేశంలో మరోసారి బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమని డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు.