ఈనెల 15 నుంచి జిల్లాల్లో కోర్టులు తెరవాలని హైకోర్టు నిర్ణయం

Update: 2020-06-09 11:32 GMT

ఈ నెల 15 నుంచి జిల్లాల్లో కోర్టులు తెరవాలని తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. కోర్టుల్లో ఈ నెల 15 నుంచి ఆగస్టు 8 వరకు దశలవారీగా లాక్‌డౌన్‌ను ఎత్తివేసేలా హైకోర్టు ప్రణాళిక రూపొందించింది. ప్రతి 15 రోజులకు ఒకసారి పరిస్థితులను సమీక్షించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు ఆదేశాల్లో పేర్కొంది. జిల్లా కోర్టుల్లో ఆగస్టు 8 వరకు పరిమిత సంఖ్యలో కేసుల విచారణ చేపట్టాలని ధర్మాసనం సూచించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని కోర్టుల లాక్‌డౌన్ ఈ నెల 28 వరకు యాథావిధిగా కొనసాగుతుందని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. హైకోర్టులో ఈ నెల 28 వరకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారానే విచారణ కొనసాగించనున్నట్లు పేర్కొంది.

Tags:    

Similar News