Indrakaran Reddy: న్యూట్రిషన్ కిట్ పథకం గర్భిణీలకు వరంగా మారనుంది..

Indra Kiran Reddy: న్యూట్రిషన్ కిట్ పథకం గర్భిణీలకు వరంగా మారనుంది

Update: 2022-12-21 11:20 GMT

ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ

Adilabad: గర్భిణీల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపాలను నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి. ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో ఈ పథకాన్ని మంత్రి ప్రారంభించారు. బిడ్డ సంరక్షణ కోసం ఇప్పటికే కేసీఆర్ కిట్ అమ‌లు చేస్తున్న ప్రభుత్వం తల్లి సంరక్షణ కోసం ఇప్పుడు కేసీఆర్‌ న్యూట్రిషన్ కిట్ ప‌థ‌కం ప్రవేశ‌పెట్టింద‌న్నారు. రాష్ట్రంలో అత్యధికంగా రక్తహీనత న‌మోద‌వుతున్న 9 జిల్లాల్లో ఆదిలాబాద్ ఒక‌ట‌న్నారు. కొత్తగా అమలు చేస్తున్న న్యూట్రిషన్ కిట్ ప‌థ‌కం గర్భిణీలకు వరంగా మారనుంద‌న్నారు.

Tags:    

Similar News