దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారి మక్బూల్ మృతి
Dilsukhnagar Bomb Blast: సయ్యద్ మక్బూల్ దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన సూత్రధారి. అనారోగ్యంతో చికిత్స పొందుతూ గాంధీ ఆసుపత్రిలో మృతి చెందారు.
Dilsukhnagar Bomb Blast: సయ్యద్ మక్బూల్ దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన సూత్రధారి. అనారోగ్యంతో చికిత్స పొందుతూ గాంధీ ఆసుపత్రిలో మృతి చెందారు. ఆయన వయస్సు 52 ఏళ్లు. నెల రోజుల క్రితం ఆయనకు గుండె ఆపరేషన్ జరిగింది. ఈ ఆపరేషన్ తర్వాత మక్బూల్ ఆరోగ్యం దెబ్బతింది. కిడ్నీ సంబంధిత సమస్యలు ప్రారంభమయ్యాయి. దీంతో ఆయనను చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ చనిపోయారు.
దిల్ సుఖ్ నగర్ బాంబుపేలుళ్ల కేసులో మక్బూల్ కు దిల్లీ కోర్టు జీవితఖైదు విధించింది. ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకులు ఆజం ఘోరికి మక్బూల్ అత్యంత సన్నిహితుడనే పేరుంది. ఈ సంస్థలో ఆయన కీలక సభ్యుడని పోలీసులు చెబుతున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఆయనపై కేసులున్నాయి. హైద్రాబాద్ లో నమోదైన కేసులకు సంబంధించి ట్రాన్సిట్ వారంట్ పై ఆయనను దిల్లీ నుంచి హైద్రాబాద్ కు తీసుకు వచ్చారు.