ఢిల్లీ నుంచి గులాబీ బాస్ బ్రహ్మాస్త్రంతో తిరిగొచ్చారా?

CM KCR: వెయిట్‌ చేసి చేసి, చివరికి చేసేదేమీ లేక ఢిల్లీ టు హైదరాబాద్‌ ఫ్లైటెక్కి ల్యాండయ్యారు సీఎం కేసీఆర్.

Update: 2021-11-26 10:46 GMT

ఢిల్లీ నుంచి గులాబీ బాస్ బ్రహ్మాస్త్రంతో తిరిగొచ్చారా?

CM KCR: వెయిట్‌ చేసి చేసి, చివరికి చేసేదేమీ లేక ఢిల్లీ టు హైదరాబాద్‌ ఫ్లైటెక్కి ల్యాండయ్యారు సీఎం కేసీఆర్. ఎలాగైనా ప్రధాని మోడీని కలిసి, వరిధాన్యంపై చర్చించాలని తపించినా, దర్శనభాగ్యం మాత్రం లభించలేదు. చివరికి అమిత్‌ షా, ఇతర మంత్రులు కూడా కలిసే అవకాశం కల్పించలేదు. ఒట్టి చేతులతో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమైన గులాబీ బాస్, వస్తూవస్తూ బ్రహ్మాస్త్రం వెంట తెచ్చుకున్నారా? అదే కమలనాథుల పాలిటి పాశుపతాస్త్రం అవుతుందని ఫిక్సయ్యారా? అపాయింట్‌మెంట్‌ దొరక్కపోవడంపై కేసీఆర్‌ ఎక్కుపెడుతున్న ఆ సెంటిమెంట్‌ వెపనేంటి?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు, ఢిల్లీ పర్యటన, రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. మూడు రోజులు అక్కడే వున్న సీఎం, అపాయింట్‌మెంట్ల కోసం పడిగాపులుగాచి, చివరికి ఎవర్నీ కలవకుండానే, హైదరాబాద్‌కు రిటర్న్ కావడంపై వాడివేడిగా డిస్కషన్ సాగుతోంది. ఎలాంటి అంశమైనా, ఆయుధంగా మలిచే కేసీఆర్, తాజా ఢిల్లీ టూర్‌ పరిణామాలను కూడా, బీజేపీకి వ్యతిరేకంగా అస్త్రాలుగా సంధించే అవకాశం వుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రధానితో అపాయింట్‌మెంట్‌ లేదు. హోంమంత్రి అమిత్‌ షా కూడా కలవలేదు. కేంద్రమంత్రులనూ కలుసుకోలేదు. కేవలం కేటీఆర్‌ బృందమే కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ కలిసింది కానీ, ముఖ్యమంత్రి మాత్రం ఎవర్నీ మీట్‌ కాలేదు. ప్రధానమంత్రి, హోంమంత్రి అపాయింట్ల కోసం వెయిట్‌ చేసి చేసి, తిరుగుముఖం పట్టడాన్ని, చాలా చేదు అనుభవంగా పరిగణిస్తున్నారు సీఎం కేసీఆర్, ఈ పరిణామాన్ని చాలా సీరియస్‌గా తీసుకోవాలని భావిస్తున్నారు.

వరి ధాన్యం కొనుగోళ్లతో పాటు తెలంగాణ రైతుల సమస్యలు వివరించేందుకు ఢిల్లీ వెళ్లారు కేసీఆర్. ప్రధాని నరేంద్రమోడీని స్వయంగా కలిసి వివరించాలనుకున్నారు. కానీ మోడీ దర్శనభాగ్యం మాత్రం దొరకలేదు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మాత్రం అపాయింట్‌మెంట్ ఇచ్చిన నరేంద్రమోడీ, కేసీఆర్‌కు అవకాశం ఇవ్వలేదు.

వరుస ప్రెస్‌మీట్లతో విమర్శించినందుకే మోడీ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదా? మమతకు ఛాన్స్ ఇచ్చి కేసీఆర్‌కు ఎందుకివ్వలేదు? టీఆర్ఎస్ విషయంలో కేంద్రం వైఖరి ఎందుకు మారింది? ఇవే ప్రశ్నలు గులాబీదళాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సెప్టెంబరులో రెండుసార్లు కేసీఆర్ ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, గజేంద్రసింగ్‌ షెకావత్‌, పీయూష్‌ గోయల్‌ అడిగిన వెంటనే అపాయింట్‌మెంట్లు ఇచ్చారు. అమిత్‌ షా అయితే విజ్ఞాన్‌ భవన్‌లో రెండు సార్లు కేసీఆర్‌తో ప్రత్యేకంగా మీట్‌ అయ్యారు. తన నివాసంలోనూ డిస్కషన్ సాగించారు. ఈసారి మాత్రం మోడీ, షాల నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. గోయల్‌ కూడా అంటీముట్టనట్లు వ్యవహరించారు.

హుజూరాబాద్‌ బైపోల్‌లో పరాజయం తర్వాత, వరుసబెట్టి ప్రెస్‌మీట్లతో కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు కేసీఆర్. తెలంగాణ రైతులపై నరేంద్ర మోడీ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ కురిపిస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ కామెంట్ల రిపోర్ట్‌లను, మోడీ, షాలకు పంపించారు రాష్ట్ర బీజేపీ నేతలు. వీటిపై మోడీ, షాలు రగిలిపోయారని, అందుకే అపాయింట్‌మెంట్‌లు ఇవ్వకుండా, కేసీఆర్‌ను సతాయించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అంతేకాదు, టీఆర్ఎస్‌-బీజేపీలు గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అంటూ రేవంత్‌ రెడ్డి హైలెట్ చేస్తున్నారు. కేంద్రం తమను ఎన్నో అంశాలపై ప్రశంసించిందని, టీఆర్ఎస్ మంత్రులు కూడా వీలుచిక్కినప్పుడల్లా చెప్పుకుంటారు. ఇలాంటి పరిణామాలు రాష్ట్ర బీజేపీ నేతలకు ఇబ్బందిగా మారాయి. తాము స్టేట్‌లో ఎంత ఫైట్ చేసినా, అంతా నీరుగారిపోతోందని భావిస్తున్నారట. బీజేపీకి-టీఆర్ఎస్‌కు దోస్తీ లేదని, కుస్తీనే వుందని ఎస్టాబ్లిష్‌ కావాలని కేంద్ర నేతలకు చెప్పారట. అలాంటి సిచ్యువేషన్ వున్నప్పుడే, తాము ధాటిగా పోరాటం చెయ్యగలమని, వచ్చే ఎన్నికలకు మరింత దీటుగా ఫైట్ చెయ్యగలగమని అంటున్నారట.

జనంలోనూ ఎలాంటి గందరగోళం వుండదని ఢిల్లీ బీజేపీ టాప్ లీడర్లకు వివరించారట. ఇలాంటి పరిణామాల నేపథ్యంలోనే, కేసీఆర్‌తో కయ్యం వుందని హైలెట్ కావాలని బీజేపీ అగ్రనాయకత్వం కూడా డిసైడయ్యిందట. అందులో భాగంగానే, కేసీఆర్ ఢిల్లీ వచ్చినా, మోడీ, అమిత్‌ షాలు అపాయింట్‌మెంట్‌లు ఇవ్వలేదన్న చర్చ జరుగుతోంది. చివరికి వరిధాన్యంపై కేటీఆర్‌ బృందాన్ని కూడా, పీయూష్ గోయల్‌ సతాయించారు. ముక్తసరిగా మాట్లాడారట. గోయల్ నుంచి ఎలాంటి హామి లభించలేదట. అంటే, టీఆర్ఎస్‌‌పై కేంద్రం స్టాండ్ మారింది. ఇక తాడోపేడో తేల్చుకోవడానికే డిసైడయ్యింది.

కేంద్రం వైఖరి ఎలా వున్నా, ఎలాంటి వ్యూహమైనా, కేసీఆర్‌ మాత్రం అంత ఈజీగా ఇలాంటి ఘటనలను వదిలే ప్రసక్తేలేదు. బీజేపీ తీరు, బీజేపీకే నష్టమయ్యలా స్ట్రాటజీ ప్రిపేర్ చేసే పనిలో వున్నారు కేసీఆర్. అపాయింట్‌మెంట్లు సరిగా ఇవ్వకుండా, ఇచ్చినా తమ గోడు పట్టించుకోకుండా కేంద్ర మంత్రులు తమను అవమానించారన్న చర్చను, జనంలోకి తీసుకెళ్లాలని కేసీఆర్‌ నిర్దేశించారట. కేసీఆర్‌ ఢిల్లీకి వచ్చినప్పుడే, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ జోధ్‌పూర్‌ వెళ్లడమేంటని, ఒక అరగంట కలవడానికి ఇబ్బందేంటన్న విషయాలను, సీరియస్‌గా జనంలో చర్చకు పెట్టాలని కేసీఆర్‌ చెప్పారట. తెలంగాణ ముఖ్యమంత్రిని కేంద్ర ప్రభుత్వం అవమానించిందన్న సెంటిమెంట్‌ రాజెయ్యాలని కర్తవ్యబోధ చేశారట.

కేంద్రప్రభుత్వంపై పోరుకు, సెంటిమెంట్‌ అస్త్రానికి కేసీఆర్‌ పదునుపెడుతుంటే, స్టేట్ బీజేపీ లీడర్స్ మాత్రం, అంతా తూచ్‌ అంటూ కౌంటర్ ఇవ్వడం మొదలెట్టారు. అపాయింట్‌మెంట్లు ఇవ్వకుండా అవమానించే సంస్కృతి తమకు లేదని తిప్పికొడుతున్నారట. మరి ఢిల్లీలో అపాయింట్‌మెంట్‌ సెంటిమెంట్‌‌, నిజంగా జనంలో పని చేస్తుందా? కేసీఆర్‌ ఆయుధం బీజేపీకి బలంగా తాకుతుందా? జనం ఎవరి మాట నమ్ముతారు? రానున్న కాలమే వీటికి సమాధానం.

Tags:    

Similar News