Dharmapuri Arvind: దుకాణాలకు వెళ్లి ఓట్లను అభ్యర్థించిన ధర్మపురి అర్వింద్
Dharmapuri Arvind: జగిత్యాల జిల్లా కోరుట్లలో బీజేపీ అభ్యర్థి అర్వింద్ ఎన్నికల ప్రచారం
Dharmapuri Arvind: జగిత్యాల జిల్లా కోరుట్లలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని నంది చౌరస్తా వద్ద గల కూరగాయల మార్కెట్‌లో దుకాణాలకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు అర్వింద్. తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం కోరుట్ల పట్టణంలోని రాంనగర్, ఏకీన్‌పూర్, అయ్యప్పగుట్ట, జగజ్జీవన్‌రావు చౌరస్తా, వెంకటేశ్వర టెంపుల్ చౌరస్తా, కొత్త బస్టాండ్, ఝాన్సీ రోడ్, అర్బన్ కాలనీల్లో కార్నర్ మీటింగ్‌లలో పాల్గొన్నారు. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని ప్రార్థించారు.