Dethadi Harika: ఆ పదవి నుండి తప్పుకుంటున్నా- దేత్తడి హారిక
Dethadi Harika: తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ పదవి నుండి తప్పుకుంటున్నట్లు హారిక తెలిపారు.
Dethadi Harika: తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ(టీఎస్‌టీడీసీ) అలేఖ్య హారిక (దేత్తడి ఫేం)ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం వివాదాస్పదమైన నేపధ్యంలో ఆ పదవి నుండి తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోని షేర్ చేశారు. ''మహిళా దినోత్సవం రోజున టీఎస్‌టీడీసీకి బ్రాండ్ అంబాసిడర్‌గా నన్ను నియమించిన విషయం మీ అందరికీ తెలుసు. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను. నన్ను సపోర్ట్ చేసిన వారందరికీ ధన్యవాదాలు. ప్రతిఒక్కరూ ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక నుంచి సిరీస్‌లపై ఎక్కువ దృష్టి సారిస్తాను.'' అని హారిక పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోకుండా నియామకం చేపట్టారంటూ ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న హారికను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తూ పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా ఆమెకు నియామక పత్రం అందించారు. ఈ నిర్ణయం వివాదం కావడంతో ముఖ్యమంత్రి కార్యాలయం పర్యాటక అభివృద్ధి సంస్థను వివరణ అడిగింది. ఈ క్రమంలోనే అలేఖ్య హారిక తాజాగా ఈ వీడియోని షేర్ చేశారు.