Telangana: నామినేషన్ల దాఖలుకు ముగిసిన గడువు

Telangana: 13న నామినేషన్ల స్క్రూటినీ.. 15న నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు

Update: 2023-11-10 09:43 GMT

Telangana: నామినేషన్ల దాఖలుకు ముగిసిన గడువు

Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. ఈ నెల 3 తేదీనుంచి నామినేషన్లు ప్రారంభం కాగా.. నేటితో గడువు ముగిసింది. అయితే.. 3 గంటలలోపు ఆర్వో కార్యాలయం ఆవరణలో ఉన్నవారికి నామినేషన్ దాఖలు చేసేందుకు ఈసీ అధికారులు అనుమతిచ్చారు. కాగా.. ఒకేసారి అభ్యర్థులు క్యూ కడితే.. టోకెన్ పద్దతిలో దాఖలు చేసేందకు అనుమతిచ్చారు. నామినేషన్ దాఖలు చేసినప్పటినుంచి అభ్యర్థి ఖర్చును లెక్కించనున్నారు. రాష్ట్రంలో 67 మంది వ్యవ పరిశీలకులను సీఈసీ నియమించింది. ఎప్పటికప్పుడు నివేదికను పరిశీలకులు సీఈసీకి పంపిస్తున్నారు.

నామినేషన్ల పర్వం ముగియటంతో ఈ నెల 13న నామినేషన్ల స్క్రూటినీ చేయనున్నారు. 15న నామినేషన్ల ఉపసంహరణకు చివరిగడువు విధించారు. కాగా.. ఈ నెల 30 న పోలింగ్ జరగనుండగా...డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు.

Tags:    

Similar News