Corona Cases in Nizamabad: నిజామాబాద్ జిల్లాను వణికిస్తున్న కరోనా
Corona Cases in Nizamabad: రోజుకు వెయ్యికి పైగా కేసులు నమోదు * ప్రభుత్వ కార్యాలయాల్లో అధికంగా కేసులు
Corona Cases in Nizamabad: నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆఫీసుల గేట్లకు నో ఎంట్రీ బోర్డులు వేలాడుతున్నాయి. ఏ ఆఫీసుకు వెళ్లినా లోపలికి రావొద్దంటూ బోర్డులు కనిపిస్తున్నాయి. ఏ పనైనా ఇక్కడి నుంచి చెప్పాలని అధికారులు అంటున్నారు. ఏవైనా దరఖాస్తులు ఉంటే బాక్సులో వేసి వెళ్లండి అంటున్నారు. ఇలా వాళ్లు ఎందుకు చేస్తున్నారో ఈపాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. అవును కరోనా భయం. మహారాష్ట్రను ఆనుకొని ఉన్న నిజామాబాద్ జిల్లాను కరోనా పట్టిపీడిస్తోంది. ప్రభుత్వ ఆఫీసులో విచ్ఛలవిడివిగా స్ప్రెడ్ అవుతుంది. ఆ శాఖ ఈ శాఖ అన్న తేడా ఆన్ని శాఖలను కరోనా మడతపెట్టేస్తోంది.
అఖరికి పోలీస్‌శాఖను కూడా కరోనా వదలడం లేదు. ఇప్పటికే ఇద్దరు కానిస్టేబుళ్లను పొట్టునపెట్టుకుంది. మరో 100 మందికి పైగా ఖాకీలకు కరోనా సోకింది. ఇటు కామారారెడ్డి జిల్లాలోనూ 120 మంది పోలీసులను కరోనా టచ్ చేసింది. మరోవైపు వివిధ ప్రభుత్వ శాఖల్లో మరో 30 మంది ఉద్యోగులకు కరోనా కన్‌ఫామ్ అయ్యింది. రెండు రోజుల వ్యవధిలో మరో 5గురు ఎప్లాయీస్ చనిపోయారు. మద్నూర్ ఎంపీడీవో నగేష్, డిచ్‌పల్లి ఐకేపీ ఏపీఎం ఉమాకాంత్, ఇద్దరు ఏఆర్ కానిస్టేబుళ్లు సద్దాం, పరవేష్ షైన్‌తో పాటు నందిపేట మండలం గాదేపల్లి ప్రభుత్వ పాఠశాల అటెండర్ పోశన్న కరోనాకు బలయ్యారు. ఇంకా వందలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా సోకింది. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా టెన్షన్ పట్టుకుంది. అందుకుని ప్రజలను గేట్ల వద్దే ఆపేస్తున్నారు.
కలెక్టరేట్‌లో అధికారులు కరోనాకు భయపడుతూ విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రతి సోమవారం నిర్వహించే గ్రివెన్స్ సెల్‌ను కూడా రద్దు చేశారు అధికారులు. కలెక్టరేట్‌లోకి ఉద్యోగులు మినహా బయట వ్యక్తులను అనుమతించడం లేదు. గేట్ వద్దనే ఒక బాక్స్ ఏర్పాటు చేశారు. అధికారులకు వినతులు ఇవ్వాలంటే ఆ బాక్స్‌లో వేసి వెళ్లాలని సిబ్బంది సూచిస్తున్నారు. ఫలితంగా కలెక్టరేట్ బోసిపోయి కనిపిస్తోంది.