Cyber Crime in Hyderabad: కొత్త దారుల్లో సైబర్ కేటుగాల్లు...హైదరాబాద్ యువకుడికి మర్చిపోలేని అనుభవం
Cyber Crime in Hyderabad: క్రమంగా సైబర్ నేరాలు పెరుగుతుండడంతో ప్రజలందరూ అప్రమత్తమవుతున్నారు. అయినా ఈ సైబర్ కేటుగాళ్లు రోజుకో రూటు మార్చి ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు
Cyber Crime in Hyderabad: క్రమంగా సైబర్ నేరాలు పెరుగుతుండడంతో ప్రజలందరూ అప్రమత్తమవుతున్నారు. అయినా ఈ సైబర్ కేటుగాళ్లు రోజుకో రూటు మార్చి ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఇప్పటికే ఫోన్ ల ద్వారా, ఎస్ఎంఎస్ ల ద్వారా నమ్మించి మోసం చేస్తున్నారు. ఓఎల్ఎక్స్ ద్వారా తక్కువ రేటుకే ఏదైనా వస్తువును అమ్మేస్తామని అందిన కాడికి దండుకోవడం, అదే విధంగా బ్యాంకు ఖాతాల వివరాలు తెలుసుకొని లక్షలు కొల్లగొట్టడం చేసేవారు. ఇప్పటికే ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. దీంతో ప్రజలు అప్రమత్తవ్వడంతో కొత్త రూట్ ను వెతుకున్నారు సైబర్ నేరగాల్లు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో తాజాగా ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది. నగరానికి చెందిన ఓ యువకుణ్ని విదేశీ మహిళ పేరిట సోషల్ మీడియాలో పరిచయం చేసుకుంది.
ఆ యువకుడికి బహుమతులు పంపిస్తానంటూ సుమారుగా రూ.4 లక్షలు స్వాహా చేసారు. ఈ ఘటన సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ నగరంలోని నాచారం ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి ఫేస్ బుక్ లో ఓ రిక్వెస్ట్ వచ్చింది. ట్రేసీ రొనాల్డ్ అనే మహిళ నుంచి వచ్చిన ఆ రిక్వెస్ట్ ని ఆ యువకుడు ఆక్సెప్ట్ చేసాడు. ఆ తరువాత వారు ఛాటింగ్ చేసుకోవడం మొదలు పెట్టారు. అప్పుడు ఆ మహిళ తను బ్రిటన్‌లోని ఓ ఫార్మా కంపెనీలో పని చేస్తున్నానని పరిచయం చేసుకుంది. అలా కొన్నాళ్ల పాటు ఫేస్ బుక్ లో కొనసాగిన వారి స్నేహం వాట్సప్ దాకా చేరుకుంది.
ఒకరి నంబర్లు ఒకరు మార్చుకుని తరచూ చాటింగ్ చేసుకునే వారు. అలా ఛాటింగ్ చేస్తూ ఓ రోజు విదేశీ యువతి త్వరలో మా మమ్మీ బర్త్ డే ఉంది.. నీకు గిఫ్ట్ పంపిస్తానని చెప్పింది. దానికి ఆ యువకుడు సరే అని ఒప్పుకున్నాడు. ఆ తరువాత కొన్ని రోజులకు అతడికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ప్రియాదేవిగా పరిచయం చేసుకున్న ఓ మహిళ కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ నుంచి మాట్లాడుతున్నానని చెప్పింది. గిఫ్ట్ పేరిట రూ. 25 వేలు పంపాలని సూచించింది. అలా చాలా సార్లు రకరకాల ఛార్జీల పేరుతో సుమారుగా రూ.cyber-fraudsters-duped-hyderabad-man-for-rs-3-95-lakhవసూలు చేశారు. ఇన్ని డబ్బులు కట్టినా ఎంతకీ గిఫ్ట్ రాకపోవడంతో మోసపోయానని గ్రహించి రాచకొండ పోలీసులను ఆశ్రయించాడు.