Corona Effect On Govt Offices: ప్రభుత్వ కార్యాలయాల్లో నో ఎంట్రీ బోర్డులు

Corona Effect On Govt Offices: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల ముందు నో ఎంట్రీ బోర్డులు పెట్టేశారు. కొన్ని ఆఫీసులకైతే ఏకంగా తాళాలే వేసేశారు.

Update: 2020-07-25 11:49 GMT
corona

Corona Effect On Govt Offices: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల ముందు నో ఎంట్రీ బోర్డులు పెట్టేశారు. కొన్ని ఆఫీసులకైతే ఏకంగా తాళాలే వేసేశారు. ఫిర్యాదులైనా, వినతిపత్రాలైనా సరే స్వయంగా స్వీకరించేందుకు ఉద్యోగులు వణికిపోతున్నారు. కరోనా భయంతో కొందరు సెలవులు పెడుతుంటే, మరికొందరు విధులకు హాజరైనా గేట్లకు తాళాలు వేసుకుంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులను భయపెడుతున్న కరోనా తీవ్రతపై ప్రత్యేక కథనం.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ శాఖలకు కరోనా భయం వెంటాడుతోంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో విధులు నిర్వర్తించేందుకు ఉద్యోగులు వణికిపోతున్నారు. ప్రజలను కార్యాలయాల్లోకి అనుమతించడం లేదు. అప్లికేషన్లు, ఫిర్యాదులు, వినతిపత్రాల కోసం ఆఫీస్ బయటే అట్టపెట్టెలను పెడుతున్నారు. ఇక, జనం తాకిడి ఎక్కువగా ఉండే, కలెక్టరేట్‌లో ప్రజావాణిని రద్దు చేయడంతోపాటు ఫిర్యాదుల కోసం బాక్సును పెట్టారు. దాంతో, తమ సమస్యలను స్వయంగా అధికారులకు చెప్పుకునేందుకు వస్తున్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే 11వందలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా, 41మంది మృత్యువాత పడ్డారు. కామారెడ్డి జిల్లాలో 11మంది, నిజామాబాద్‌ జిల్లాలో 30మంది మరణించారు. వైరస్ సోకినవాళ్లలో పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా పెద్ద‌సంఖ్యలో ఉన్నారు. కామారెడ్డి, నిజామాబాద్‌లో సుమారు 40మంది పోలీసులు కోవిడ్ బారినపడ్డారు. అలాగే, పలువురు రెవెన్యూ ఉద్యోగులు కూడా కరోనా బాధితులుగా మారారు. దాంతో, తమకు కూడా వైరస్ సోకుతుందేమోనని మిగతా ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అందుకే, కార్యాలయాల గేట్లకు తాళాలు వేసి, దూరం నుంచే ఫిర్యాదులు, వినతిపత్రాలు స్వీకరిస్తున్నారు. 

Tags:    

Similar News