సమయం వచ్చినప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటానని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శించుకున్న ఆయన మోడీ నాయకత్వంలో భారత్ పేదరికం లేని, బలమైన దేశంగా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. 370 ఆర్టికల్ రద్దును దేశప్రజలంతా అభినందిస్తున్నారని కోమటిరెడ్డి తెలిపారు. మరోవైపు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి అభినందనలు తెలిపారు కోమటిరెడ్డి.