Komatireddy Rajagopal Reddy: మందుబాబులకు క్లాస్ తీసుకున్న ఎమ్మెల్యే
Raj Gopal Reddy: నల్గొండ జిల్లా మునుగోడులో వైన్‌షాపులను ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Raj Gopal Reddy: నల్గొండ జిల్లా మునుగోడులో వైన్‌షాపులను ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నకిలీ మందు విక్రయాలపై ఆరా తీశారాయన.. దుకాణంలో మద్యం బాటిళ్లను రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు. పక్కనే ఉన్న పర్మిట్ రూములను పరిశీలించారు. ఉదయమే మద్యం తాగుగున్న మందుబాబులకు ఎమ్మెల్యే క్లాస్ తీసుకుని, వారిని పర్మిట్ రూము నుంచి ఎమ్మెల్యే పంపించేశారు.
ఉదయాన్నే పర్మిట్ రూంలలో కూర్చుంటే కుటుంబ పరిస్థితి ఏంటని సీరియస్ అయ్యారు. ఉదయం పూట పర్మిట్ రూముల్లోకి ఎవరికి అనుమతి ఇవ్వొద్దంటూ వైన్ షాపుల యజమానులకు హుకుం జారీ చేశారు. బెల్ట్ షాపులకు మద్యం అమ్ముతున్నారా అంటూ ఆరా తీశారు. బెల్డ్ షాపులకు మద్యం విక్రయిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గ్రామాల్లో మద్యం అమ్మకాలు జరగకుండా కట్టడి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.