IT Raids: ఐటీ విచారణకు హాజరుకాని కాంగ్రెస్ నేతలు
IT Raids: ఎన్నికల్లో బిజీగా ఉండడంతో హాజరుకాలేనన్న కేఎల్ఆర్
IT Raids: ఐటీ విచారణకు కాంగ్రెస్ నాయకులు గైర్హాజరయ్యారు. ఇటీవల కాంగ్రెస్ నేతలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. తనిఖీల సమయంలో పలు కీలకమైన డాక్యుమెంట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారణకు రావాలని ఐటీ అధికారులు నోటీసులు పంపారు. ఐటీ విచారణకు హాజరుకాలేమని అధికారులకు కాంగ్రెస్ నేతలు తెలిపారు. విచారణకు తమ చార్టర్డ్ అకౌంటెంట్లను కాంగ్రెస్ నేతలు పంపారు. ఎన్నికల్లో బిజీగా ఉన్నందునా... విచారణకు హాజరుకాలేనని మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ఆర్ తెలిపారు. వ్యక్తిగత కారణాలతో విచారణకు రాలేనని పారిజాత ఐటీ అధికారులకు తెలిపారు.