అచ్చంపేట ఘటనపై ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేత నిరంజన్
Niranjan: బీఆర్ఎస్ పార్టీకి సీఐ అనుకూలంగా పనిచేస్తున్నాడు
Niranjan: అచ్చంపేట ఘటనపై కాంగ్రెస్ నేత నిరంజన్ ఈసీకి ఫిర్యాదు చేశారు. అచ్చంపేట సీఐ అనుదీప్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణను బెదిరించిన వీడియోను కాంగ్రెస్ నేత నిరంజన్ కంప్లైంట్‌లో జత చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలకు సినిమా చూపిస్తానని బెదిరించాడని.. వెంటనే సీఐపై చర్యలు తీసుకోవాలని నిరంజన్ కోరారు. బీఆర్ఎస్ పార్టీకి సీఐ అనుకూలంగా పనిచేస్తున్నారని నిరంజన్ ఆరోపించారు.