Farmers Alert: రైతన్నలకు అలర్ట్..రుణమాఫీ వర్తించని రైతుల వివరాలివి..మీ పేరుందో లేదో చెక్ చేసుకోండి
Farmers Alert: ఆగస్టు15లోపల 2 లక్షల రుణమాఫీని చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను రిలీజ్ చేసింది.
Farmers Alert:ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కొటిగా అమలు చేస్తూ వస్తోంది. ఆగస్టు15లోపల 2 లక్షల రుణమాఫీని చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. దీంట్లో రుణమాఫీ పథకానికి సంబంధించిన నియమ నిబంధనలను స్పష్టంగా పేర్కొంది. ఈ నిబంధనలను పరిగణలోనికి తీసుకుంటే..రాష్ట్రంలో కొంతమంది రైతులకు రుణమాఫీ స్కీం వర్తించదని తెలుస్తోంది. ఆ వివరాలను చూద్దాం.
-రేషన్ కార్డు ప్రామాణికంగానే ఈ పంట రుణమాఫీని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇది కేవలం తెల్లరేషన్ కార్డుఉన్నవారికే ఈ పథకం వర్తిస్తుంది. దీన్ని బట్టి పింక్ రేషన్ కార్డుదారులతో పాటు ట్యాక్స్ పేయర్స్ కు కూడా రుణమాఫీ పథకం వర్తించదని తెలుస్తోంది.
-ఈ పథకం స్వల్పకాలిక పంటరుణాలకు వర్తిస్తుందని మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొంది. అయితే దీర్ఘకాలిక పంటలకు ఈ రుణమాఫీ వర్తించదు. వరి, పత్తి, చెరుకు, కూరగాయలు వంటిసీజనల్పంటలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. మామిడి, నిమ్మ, బత్తాయి వంటి దీర్ఘకాలిక పంటలకు వర్తించదు.
-రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు వాటి బ్రాంచ్ ల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. మిగతా ప్రైవేటు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు ఇది వర్తించదు.
-పంట రుణమాఫీ కోసం డెడ్ లైన్ 12 డిసెంబర్ 2018 నుంచి 09 డిసెంబర్ 2023గా నిర్ణయించింది. ఈ మధ్య తీసుకున్న రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తుంది. అంతకుముందు తీసుకున్న తర్వాత తీసుకున్న రుణాలకు ఈ స్కీం వర్తించదు.
-2లక్షలకు పైగా రుణం తీసుకున్న రైతులకు ఈ పథకం వర్తిస్తుంది. కానీ అందుకు కూడా మెలిక పెట్టింది ప్రభుత్వం. మొదట రైతులు 2 లక్షలకు పైబడి ఉన్న రుణాన్ని బ్యాంకుకు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అర్హత గల 2లక్షల మొత్తాన్ని రైతుల ఖాతాల్లోకి బదిలి అవుతుంది. 2లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న పరిస్థితుల్లో కుటుంబంలో రుణం తీసుకున్న మహిళల రుణాన్ని మొదట మాఫీ చేసి, మిగతా మొత్తాన్ని దామాషా పద్ధతిలో పురుషుల పేరుతో తీసుకున్న రుణాలను మాఫీ చేస్తారు.
- ఈ రుణమాఫీ ఎస్ హెచ్ఐలు, జెఎల్టీలు, ఆర్ఎంజీలు, ఎస్ఇసీఎస్ కు తీసుకున్న రుణాలకు ఈ స్కీం వర్తించదు. ఈ రుణమాఫీ పునర్వ్యవస్థీకరించి లేదా రీషెడ్యూల్ చేసిన రుణాలకు కూడా ఈ పథకం వర్తించదు. కంపెనీలె, ఫర్మ్స్ వంటి సంస్థలకు ఇచ్చిన పంటరుణాలకు కూడా వర్తించదని మార్గదర్శకాల్లో సర్కార్ స్పష్టంగా పేర్కొంది.