Rythu Bharosa: రైతు భరోసాపై కాంగ్రెస్ సర్కార్ మరో ముందడుగు..పకడ్బందీ విధివిధానాలు

Rythu Bharosa:తెలంగాణ ప్రజలు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్న రైతు భరోసా పథకంపై సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ మరో ముందడగు వేసింది. గత ప్రభుత్వం హయాంలో అమలు చేసిన రైతు బంధు స్కీంలో దొర్లిన అవకతవకలు, రైతు భరోసాలో దొర్లకుండా ఉండాలని నిర్ణయించింది. దీనిలో భాగంగానే పథకం అమలుకు పకడ్బంది విధివిధానాలు రూపొందించేందుకు మంత్రివర్గ సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Update: 2024-07-03 00:33 GMT

Crop Insurance: రైతులకు అదిరిపోయే వార్త.. రైతులందరికీ ఉచితంగా పంటల బీమా

Rythu Bharosa స్కీం:ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఒక్కొఒక్కొటిగా అమలు చేస్తూ వస్తోంది. ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఇప్పటికే పలు స్కీములను అమలు చేసింది సర్కార్. ఇంకొన్ని హామీలను అమలు చేసే దిశగా కసరత్తు షురూ చేసింది. ఈ క్రమంలోనే రైతులకు సంబంధించిన హామీల్లో ఒక్కటైనా రైతురుణమాఫీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అయితే రైతురుణమాఫీకోసం ఎదురు చూస్తున్నవారికి త్వరలోనే అమలు చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. అయితే ఈ స్కీంను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.

రైతు భరోసా స్కీం అమలుకు విధివిధానాలు రూపొందించేందుకు సర్కార్ మంత్రి వర్గ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సబ్ కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తుండగా..మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావును సభ్యులుగా చేర్చింది. ఈ కమిటీ రైతు భరోసా స్కీంకు సంబంధించిన గైడ్ లైన్స్ ను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందిస్తుంది.

ఇక బీఆర్ఎస్ సర్కార్ రైతు బంధు కింద ఎకరానికి 10వేల రూపాయలు పెట్టుబడి సాయం కింద అందించగా..రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం ఏడాదికొ ఒక్కోఎకరానికి 15వేల సాయం అందిస్తామని చెబుతోంది. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీని అధికారంలోకి రాగానే రైతు భరోసా అమలు చేయాల్సి ఉండగా..రైతు బంధు పథకంలో ఎన్నో అవకతవకలు జరిగినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ అవకతవకలన్నింటినీ పరిగణలోనికి తీసుకుని పకడ్బందీగా గైడ్ లైన్స్ రూపొందించేందుకు ప్రభుత్వం తాజాగా కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ సబ్ కమిటీ ఇచ్చే విధివిధానాలను మాత్రమే పరిగణలోనికి తసుకోకుండా..వాటిని అసెంబ్లీలో చర్చకు పెట్టి..వాటిపై ఆయా పార్టీల నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకుంటామని సీఎం రేవంత్ తెలిపారు. దీంతో రైతు భరోసా స్కీంపై రేవంత్ సర్కార్ ఎలాంటి నిబంధనలు పెడుతుంది. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటందనేది రైతుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 

Tags:    

Similar News