Indrasena Reddy's Death News: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ ఇంద్రసేనా రెడ్డి ఇక లేరు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు.
ఇంద్రసేనా రెడ్డి యువకుడిగా ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి యూత్ కాంగ్రెస్‌లో అంచెలంచెలుగా ఎదిగారు. యూత్ కాంగ్రెస్‌లో జాతీయ ప్రధాన కార్యదర్శిగానూ పనిచేశారు. ఆ క్రమంలోనే ఆయనకు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కుటుంబంతోనూ సన్నిహిత సంబంధాలు ఉండేవని చెబుతారు.
ఇంద్రసేనా రెడ్డి మృతిపై కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర సంతాపం ప్రకటించారు. ఇందిరా గాంధీ తనయుడు సంజయ్ గాంధీతో కలిసి పనిచేసిన నాయకుడిగానూ ఇంద్రసేనా రెడ్డిని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గుర్తుచేసుకుంటున్నాయి. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమంలోనూ ఇంద్రసేనా రెడ్డి చురుకుగా వ్యవహరించారు.