TGSRTC: ఆర్టీసీ బస్సులో మహాలక్ష్మీ పుట్టింది..బస్సులో మహిళకు ప్రసవం చేసిన కండక్టర్
TGSRTC: ఆర్టీసీ బస్సులో సడెన్ గా పురిటి నొప్పులు రావడంతో..నొప్పులు తట్టుకోలేక బాధపడుతున్న ఓ మహిళలకు మహళా కండక్టర్ తోటి మహిళా ప్రయాణికుల సాయంతో ప్రసవం చేశారు.
TS RTC:సిటీబస్సులో ఓ మహిళా కండక్టర్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. బస్సులో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళకు ప్రసవం చేశారు. అదేబస్సులో తల్లీ బిడ్డలను ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటన హైదరాబాద్ ల శుక్రవారం జరిగింది. ప్రయాణికులు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం..ముషీరాబాద్ డీపోకు చెందిన కండక్టర్ సరోజ విధి నిర్వహణలో భాగంగా ఆరంఘర్ నుంచి ఆర్టీసీ బస్సులో సికింద్రాబాద్ కు వస్తున్నారు. అదే సమయంలో ఓ గర్బిణీకి పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి.
ఇది గమనించిన కండక్టర్ బస్సును పక్కన ఆపించి ప్రయాణికులందరినీ దించేశారు. ఆ మహిళకు తోటి మహిళా ప్రయాణికుల సాయంతో బస్సులోనే ప్రసవం చేశారు. ఆ మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మినిచ్చింది. అదే బస్సులో తల్లీ బిడ్డలను సురక్షితంగా స్థానిక గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. సకాలంలో స్పందించి ఆ మహిళలకు సాయం చేసిన కండక్టర్ బస్సు డ్రైవర్ ను తోటి ప్రయాణికులు అభినందించారు.
ఆర్టీసీ బస్సులో మహిళకు ప్రసవం చేసి మానవత్వం చాటుకున్న కండక్టర్ సరోజ, సాయం చేసిన తోటి మహిళా ప్రయాణికులను మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనర్ ప్రశంసించారు. అప్రమత్తమై సకాలంలో స్పందించడం వల్లే తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారంటూ పేర్కొన్నారు. ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చడం సహాసేవా భావాన్ని చాటుతున్నారంటూ కొనియాడారు. ఈ మేరకు సజ్జనార్ ట్వీట్ చేశారు.