Peddapalli: మానేరు నదిపై కూలిన నిర్మాణంలో బ్రిడ్జి
Peddapalli: ముత్తారం మండలం ఓడేడు సమీపంలో మానేరు నదిపై నిర్మించిన బ్రిడ్జి
Peddapalli: పెద్దపల్లి జిల్లా మానేరు నదిపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలిపోయింది. ముత్తారం మండలం ఓడేడు సమీపంలో మానేరు నదిపై నిర్మించిన బ్రిడ్జి కూలింది. మానేరునదిపై ఓడేడు నుండి జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం..గర్మిళ్లపల్లి గ్రామాల మధ్య రాకపోకలు కొనసాగనున్నాయి. మానేరునదిపై 2016 ఆగస్టు నెలలో 49 కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 9 ఏళ్లు కావస్తున్నా బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి కాలేదు. గాలి దుమారానికి సిమెంట్ గడ్డర్స్ కిందపడిపోయాయి.