Revanth Reddy: నేడు నిజామాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
Revanth Reddy: ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న జీవన్‌రెడ్డి
Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నిజామాబాద్ జిల్లాల్లో పర్యటించనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి కాంగ్రెస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేపట్టారు. నిజామాబాద్‌లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఇక సీఎం రేవంత్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా పాత కలెక్టరేట్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు.