CM Revanth Security: సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీలో మార్పులు
CM Revanth Reddy Security: బెటాలియన్ పోలీసుల నిరసనలతో తెలంగాణ సీఎం సెక్యురిటీ వింగ్ కీలక నిర్ణయం తీసుకుంది.
CM Revanth Reddy Security: బెటాలియన్ పోలీసుల నిరసనలతో తెలంగాణ సీఎం సెక్యురిటీ వింగ్ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం సెక్యురిటీలో మార్పులు చేసింది. సీఎం రేవంత్ నివాసం దగ్గర బెటాలియన్ పోలీసు సిబ్బందిని తొలగించింది సెక్యురిటీల వింగ్. ఇప్పటివరకు తెలంగాణ స్పెషల్ పోలీస్ సిబ్బంది సీఎం ఇంటి దగ్గర భద్రత కల్పించగా ఈరోజు నుంచి ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసులను నియమించారు.
సమస్యలు పరిష్కరించాలంటూ టీజీఎస్పీ పోలీసులు కుటుంబసభ్యులతో కలిసి పెద్దఎత్తున నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో నిరసనలు చేస్తూ నిబంధలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ క్రమశిక్షణా చర్యల పేరుతో 39 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లను శనివారం నాడు పోలీస్ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఆదివారం నాడు ఏఆర్ ఎస్సై, మరో హెడ్ కానిస్టేబుల్ సహా ఏకంగా 10 మందిని ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అయినప్పటికీ వీరి ఆందోళనలు మాత్రం ఆగడం లేదు. తమకు వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించాలని బెటాలియన్ పోలీసులు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఆర్మ్‌డ్ రిజర్వు పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.