Heavy Rainfall: అధికారులను అలర్ట్ చేసిన సీఎం రేవంత్.. వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు సాయం పెంపు
తక్షణ సాయాన్ని కోరుతూ కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ముంపు ప్రాంతాల్లో పర్యటించాల్సిందిగా ప్రధాని మోడీని కోరారు రేవంత్ రెడ్డి.
Heavy Rainfall: తెలంగాణలో వర్షాలు, వరద సాయంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను సీఎం రేవంత్ అలర్ట్ చేశారు. కలెక్టరేట్‌లలో కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సన్నద్ధంగా ఉండాలన్నారు. ప్రజలకు జరిగిన నష్టంపై తక్షణమే అధికారులు స్పందించాలన్నారు. వరద నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
తక్షణ సాయాన్ని కోరుతూ కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ముంపు ప్రాంతాల్లో పర్యటించాల్సిందిగా ప్రధాని మోడీని కోరారు రేవంత్ రెడ్డి. వరద ప్రభావిత జిల్లాలు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట కలెక్టర్లకు తక్షణ సాయం కింద 5 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థికసాయాన్ని 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచారు.