Hyderabad AI Summit: తెలంగాణలో 200 ఎకరాల్లో ఏఐ సిటీ... ఏఐ గవర్నెన్స్ దిశగా రేవంత్ సర్కార్

Hyderabad AI Summit: హైద్రాబాద్ సమీపంలోని ముచ్చర్ల వద్ద 200 ఎకరాల విస్తీర్ణంలో ఏఐ సిటీని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Update: 2024-09-06 14:38 GMT

Hyderabad AI Summit

Hyderabad AI Summit: ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌ను అన్ని ప్రభుత్వ విభాగాల్లో వినియోగించుకొనేలా రేవంత్ రెడ్డి సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఈ దిశగా పలు టెక్ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. 2027 నాటికి తెలంగాణలో కోటి మంది వినియోగదారులకు కృత్రిమమేధ పరిజ్ఞానాన్ని అందించాలని టార్గెట్ గా పెట్టుకుంది.

హైదరాబాద్ ఏఐ గ్లోబల్ సమ్మిట్
నగరంలోని హెచ్ఐసీసీలో ఏఐ గ్లోబల్ సమ్మిట్ సెప్టెంబర్ 5న ప్రారంభమైంది. రెండు రోజుల పాటు ఈ సదస్సు జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమ్మిట్ ను ప్రారంభించారు. ప్రపంచంలోని ప్రముఖ ఐటీ కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ఏఐ నిపుణులు రెండు వేల మంది ఈ సదస్సులో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఏఐ అభివృద్దికి చేస్తున్న 25 కార్యక్రమాలను సీఎం వివరించారు. నాస్కామ్ సహకారంతో ఏఐ ఫ్రేమ్ వర్క్ అమలు చేయడంలో తెలంగాణ ఏఐ మిషన్ సహకరించేలా ప్రభుత్వం ప్లాన్ చేసింది.

ముచ్చర్ల వద్ద 200 ఎకరాల విస్తీర్ణంలో ఏఐ సిటీ
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కు భవిష్యత్తులో మరింత డిమాండ్ పెరుగుతుంది. దీంతో హైద్రాబాద్ సమీపంలోని ముచ్చర్ల వద్ద 200 ఎకరాల విస్తీర్ణంలో ఏఐ సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల పాటు జరిగిన ఏఐ గ్లోబల్ సమ్మిట్ లో పలు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఏఐ సిటీలో రెండు కంపెనీలు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించేందుకు ఒప్పందాలు కుదిరినట్టుగా ఐటీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ చెప్పారు.

ఏడబ్ల్యూఎస్, మైక్రోసాఫ్ట్, సౌత్ ఆసియా ఉమెన్ అండ్ టెక్ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. పలు విద్యాసంస్థలు, సాంకేతిక సంస్థలు, అంకుర సంస్థలతో ఒప్పందాలు జరిగాయి. కంప్యూటర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, స్కిల్లింగ్, స్టార్టప్ ఇన్నోవేషన్, జనరేటివ్ ఏఐ, రీసెర్చ్ అండ్ కోలాబరేషన్, డేటా అన్నోటేషన్ రంగాల్లో ఈ ఒప్పందాలున్నాయి.

యెట్టా, సీడాక్ సంస్థలతో ఒప్పందాలు
యెట్టా, సీడాక్ సంస్థలతో రెండు ఎంఓయూలు కుదిరాయి. యెట్టా సంస్థ హైద్రాబాద్ లో ప్రత్యేకంగా ఏఐ డేటా సెంటర్ ను నిర్మించనుంది. ఇందులో అత్యాధునిక జీపీయూ ఆధారిత ఏఐ క్లౌడ్ ఇన్ ఫ్రా కలిగి ఉంటుంది. ఇందులో అత్యాధునిక జీపీయూ ఆధారిత ఏఐ క్లౌడ్ ఇన్ ఫ్రా కలిగి ఉంది. 4,000 హెచ్ 100 జీపీయూ సామర్ధ్యంతో ప్రారంభించి భవష్యత్తులో 25 వేల హెచ్ 100 జీపీయూకు పెంచనున్నారు.

సిడాక్ పరమ్ సిద్ది-ఏఐ , ఐరావత్ టీ-ఎయిమ్స్ అంకుర సంస్థలకు ఆర్నెల్ల వరకు ఉచితంగా వెయ్యి జీపీయూ గంటలను అందిస్తారు.దీంతో కీలకరంగాల్లో ఏఐ ఆవిష్కరణలకు ప్రోత్సాహం కలుగుతుంది.యువతలో ప్రతిభ, నైపుణ్యాభివృద్ది కోసం నెక్స్ట్ వేవ్, అమెజాన్ వెబ్ సర్వీస్, మైక్రోసాఫ్ట్ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. 2.5 లక్షల మంది విద్యార్ధులు, నిపుణులకు ప్రయోజనం కలుగుతుంది. రాష్ట్రంలో ఏఐ సేవలను వేగవంతం చేసేందుకు గ్లోబల్ దిగ్గజం ఎన్విడియా కార్పోరేషన్ తో మూడేళ్లకు ఎంఓయూ చేసుకుంది ప్రభుత్వం. రాష్ట్రంలోని 200 మంది విద్యా సంస్థల నుంచి 5 వేల మంది విద్యార్థులు ఏఐలో శిక్షణ పొందుతారు.

పాఠ్యాంశంగా ఏఐ
ఏఐని పాఠ్యాంశంగా చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 33 జిల్లాల్లోనూ ఐటీ ఆధారిత పరిశ్రమల అభివృద్దిపై ఫోకస్ పెట్టింది. అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఏఐని వినియోగించుకొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు నోడల్ అధికారిని కూడా నియమించనున్నారు. శంషాబాద్ లో ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో ఏఐ కు 2 లక్షల చదరపు అడుగుల్లో ఆఫీస్ ను ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా తీర్చిదిద్దే దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకు సాగుతుంది. ఇందులో భాగంగానే ఏఐని ప్రతి రంగంలో వినియోగించుకోవాలని తలపెట్టింది.

Tags:    

Similar News