సింగరేణి కార్మికులకు సీఎం శుభవార్త.. దసరాకు రూ.లక్షా 90 వేల బోనస్

దసరాకు రూ.లక్షా 90 వేల బోనస్ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి

Update: 2024-09-20 12:46 GMT

సింగరేణి కార్మికులకు సీఎం శుభవార్త.. దసరాకు రూ.లక్షా 90 వేల బోనస్

సింగరేణి కార్మికలకు తెలంగాఅణ ప్రభుత్వం శుభవార్త అందించింది. దసరా పండుగుకు ముందుగానే కార్మికులకు బోనస్ ప్రకటిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. లాభాల్లో వాటా కూడా ఇవ్వనున్నట్టు ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి పాత్ర కీలకమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కార్మికులకు ఒక్కొక్కరికి ఒక లక్షా 90 వేల చొప్పున బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపారు.

సింగరేణి కార్మికులు ప్రభుత్వానికి తలమనికమని.. సింగరేణి ఉత్పత్తిని పెంచుతూ ఇతర రాష్ట్రాలకు కూడా బొగ్గు ఎగుమతి చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సింగరేణిని విస్తరిస్తూ కొంత పెట్టుబడి పెట్టే నిర్ణయాన్ని కూడా తీసుకున్నామన్నారు. 796 కోట్లు కార్మికులకు, ఉద్యోగులకు బోనస్ రూపంలో అందచేస్తామన్నారు.

గత ఏడాది కంటే ఒక్కో కార్మికుడికి 20 వేలు అధికంగా ఇస్తున్నామన్నారు. సింగరేణిలో 25 వేల మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారని తెలిపారు. తొలిసారిగా కాంట్రాక్టు కార్మికులకు బోనస్ ఇస్తున్నట్టు భట్టి విక్రమార్క చెప్పారు. కాంట్రాక్టు కార్మికులకు రూ.5వేలు బోనస్ అందిస్తామన్నారు. లాభాలు కార్మికులకు పంచుతున్నామని భట్టి తెలిపారు.

Tags:    

Similar News