Telangana: మహిళల కోసం సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం..వారికి ఇక పండగే

Ts News: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్నో సరికొత్త పథకాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా మహిళల కోసం ఎన్నో పథకాలను తీసుకువచ్చింది. ఇప్పుడు తాజాగా మరో సారి మహిళలకు శుభవార్త చెప్పింది రేవంత్ రెడ్డి సర్కార్. డ్వాక్రా గ్రూప్ మహిళలకు సంబంధించి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటో చూద్దాం.

Update: 2024-09-12 02:49 GMT

Telangana: మహిళల కోసం సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం..వారికి ఇక పండగే

Dwakra women in Telangana: తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సరికొత్త పథకాలను ప్రవేశపెడుతూ ప్రజల మన్ననలను పొందుతున్నారు. మరీ ముఖ్యంగా మహిళల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్నారు. ఇప్పుడు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. డ్వాక్రా మహిళలకు సంబంధించి తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వం కొలువుదీరిన రెండు రోజులకే 6 గ్యారెంటీల్లో రెండు గ్యారంటీలను అమలు చేసింది కాంగ్రెస్. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేసిన తర్వాత ఒక్కొక్క గ్యారెంటీని ప్రారంభించుకుంటూ వస్తోంది. తాజాగా ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. పొదుపు సంఘాల మహిళలకు ఎలక్ట్రిక్ ఆటోలు పంపిణీ చేయాలనీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా సమాచారం వస్తోంది. ఈ మేరకు నిన్న జనగామ జిల్లా పాలకుర్తిలో ఓ మహిళలకు ఎలక్ట్రిక్ ఆటోను పంపిణీ చేశారు. దీంతో ఆ మహిళ సంతోషం వ్యక్తం చేసింది.

డ్వాక్రా గ్రూపులో ఉన్న మహిళలకు లేదా ఆమె కుటుంబంలో లైసెన్స్ ఉన్న వ్యక్తికి ఈ ఎలక్ట్రిక్ ఆటోను ఇవ్వనున్నారు. అయితే ప్రభుత్వం స్త్రీ నిధి లోన్ నుంచి ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ను కొనుగోలు చేసి ఇవ్వున్నారు. అయితే మహిళలు ఇలా తీసుకున్న ఈ రుణాన్ని వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆటోలకు ఛార్జింగ్ పాయింట్ల కోసం ప్రభుత్వ అధికారులు అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు.

Tags:    

Similar News