Revanth Reddy: చెరువులు, నాలాల ఆక్రమణల తొలగింపుపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
Revanth Reddy: మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
Revanth Reddy: మూసీ పరివాహక ప్రాంతంలో కూల్చివేతలపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ అధికారులతో సమీక్ష జరిపిన ఆయన... ఆక్రమిత చెరువులు, నాలాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతాల పరిధిలో నివసించే అర్హులైన పేదల వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు.
అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు... లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేయాలన్నారు. ఔటర్ లోపల ఉన్న చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆక్రమణలకు గురి కాకుండా పర్యవేక్షించేందుకు చెరువుల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.