రేపు కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకోనున్న సీఎం కేసీఆర్

* వందకోట్ల రూపాయలతో కొండగట్టు అంజన్న సన్నిధి అభివృద్ధికి ప్రణాళిక

Update: 2023-02-14 02:04 GMT

రేపు కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకోనున్న సీఎం కేసీఆర్

KCR: కొండగట్టు ఆంజనేయ స్వామివారి సన్నిధిని తెలంగాణ సీఎం కేసీఆర్ సందర్శించనున్నారు. కొండగట్టు ఆలయ సందర్శనకు ముందే... యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో కీలక పాత్రపోషించిన స్థపతి ఆనంద్ సాయి కొండగట్టు పునరుద్ధరణపై ప్రాధమిక అధ్యయనం చేశారు. వందకోట్ల రూపాయలతో కొండగట్టు దేవస్థానాన్ని అభివృద్ధిచేయాలని సంకల్పించారు.

ముఖ్యమంత్రి కేసిఆర్ రేపు కొండగట్టు ఆలయాన్ని సందర్శిస్తారు. స్వామివారికి పూజలు నిర్వహించిన తర్వాత ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయితో కలిసి ఆలయాభివృద్ధికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తారు. ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయంలో చేయాల్సిన మార్పులు చేర్పులతో పాటుగా, ఆలయ ఆవరణలో భక్తుల సౌకర్యార్దం చేయనున్న అభివ్రద్ది పనులపై ఓ నిర్ణాయానికి వచ్చే అవకాశం ఉంది. పరిశీలన తరువాత సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్షించనున్నారు.

కొండగట్టులో 108 అడుగలు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఘాట్ రోడ్ల అభివ్రద్ది ఆలయ ఆవరణలో గ్రీనరి భక్తుల సౌకర్యాల నిమిత్తం పార్కింగ్. నూతన కాటేజిల నిర్మాణం. .నడకదారి అభివృద్ది లాంటి పనులు చేయాలని అధికారులతో చర్చించి సముచిత నిర్ణయం తీసుకోనున్నారు. ఆలయ ప్రాకారాల సుందరీకరణ, గర్భగుడి విస్తరణ లాంటి పనులపై చర్చిస్తారు.

Tags:    

Similar News