నేడు నాలుగు సభల్లో పాల్గొననున్న సీఎం కేసీఆర్
CM KCR: తాండూర్, కొడంగల్, మహబూబ్ నగర్, పరిగిలో ప్రచారం
CM KCR: ఇవాళ సీఎం కేసీఆర్ 4 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వంచనున్నారు. ప్రచారంలో భాగంగా తాండూర్ , కొడంగల్, మహబూబ్ నగర్, పరిగిలోని ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం పాల్గొంటారు. సిద్దిపేట్‌లో హరీశ్ రావు పర్యటించనున్నారు. అనంతరం మిరుదొడ్డిలో జరిగే రోడ్ షో లో హరీష్ పాల్గొంటారు. మునుగోడు నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
ఉదయం 11 గంటలకు మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ లో రోడ్ షో కేటీఆర్ పాల్గొంటారు. అక్కడి నుంచి సూర్యాపేట్ జిల్లా కోదాడలో మధ్యాహ్నం ఒంటి గంటకు.. హుస్నాబాద్ నియోజకవర్గం ముల్కనూర్ లో 3 గంటలకు, సాయంత్రం 5 గంటలకు శేరిలింగంపల్లి ,7 గంటలకు రాజేంద్ర నగర్ లో రోడ్ షో మంత్రి పాల్గొంటారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ఎంపీ కవిత నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు.