CM KCR: గజ్వేల్‌‌కు చేరుకున్న సీఎం కేసీఆర్.. మరికాసేపట్లో నామినేషన్

CM KCR: నామినేషన్ తర్వాత కామారెడ్డిలో కేసీఆర్ బహిరంగ సభ

Update: 2023-11-09 05:44 GMT

CM KCR: గజ్వేల్‌‌కు చేరుకున్న సీఎం కేసీఆర్.. మరికాసేపట్లో నామినేషన్

CM KCR: తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ చివరిదశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల నేతలు తమ నియోజకవర్గాల స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు గజ్వేల్‌లో కేసీఆర్ నామినేషన్ వేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్ దాఖలు చేస్తారు. తర్వాత కామారెడ్డిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఈ నెల 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రచారంలో రాజకీయ నేతలు ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు.

Tags:    

Similar News