CM KCR: నేటి నుంచి సీఎం కేసీఆర్‌ రాజశ్యామల యాగం

CM KCR: ఎర్రవెల్లి ఫామ్‌ హౌస్‌లో మూడు రోజుల పాటు యాగం

Update: 2023-11-01 03:31 GMT

CM KCR: నేటి నుంచి సీఎం కేసీఆర్‌ రాజశ్యామల యాగం

CM KCR: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ తన ఫామ్‌ హౌస్‌లో రాజశ్యామల యాగం తలపెట్టారు. నేటి నుంచి రోజులపాటు ఈ యాగం జరగనుంది. కేసీఆర్ యాగం చేసిన ప్రతిసారి విజయం సాధించగా..ఈసారి కూడా ఆయన అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

సీఎం కేసీఆర్‌కు ముందు నుంచి కొంచెం దైవ భక్తి ఎక్కువే. దైవంపై పూర్తి విశ్వాసం ఉండటంతో పాటు యాగాలపై కూడా మంచి నమ్మకం ఉంది. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని.. రాష్ట్రం, ప్రజలు అభివృద్ధి చెందాలంటూ.. 2015లో చంఢీ యాగం నిర్వహించారు. అనంతరం..2018 రెండో దఫా ఎన్నికలకు వెళ్లే ముందు కూడా సీఎం కేసీఆర్ తన ఫామ్ హౌస్‌లో రాజశ్యామల యాగం నిర్వహించారు. ఆ యాగం తర్వాత ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్.. రెండో సారి రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్నారు.

ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్‌తో గులాబీ బాస్..యాగాన్ని తలపెట్టారు. సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం ఎర్రవల్లిలోని వ్యవయసాయ క్షేత్రంలో ఈరోజు నుంచి మూడు రోజుల పాటు రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు. విశాఖపట్నం శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి పర్యవేక్షణలో యాగానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటకలకు చెందిన పలువురు పీఠాధిపతులు యాగంలో పాల్గొననున్నారు. 200 మంది వైదికులు నిన్న సాయంత్రమే ఎర్రవల్లికిచేరుకున్నారు.

పూర్వ కాలంలో రాజు యుద్ధానికి వెళ్ళే ముందు పురోహితులతో రాజ శ్యామల యాగాలు, చండీ యాగాలు, శత్రు సంహార యాగాలు నిర్వహించేవారని పురోహితులు చెబుతున్నారు. అధికారం రావడానికి, శత్రువుల బలం తగ్గడానికి, జన వశీకరణ కోసం ఈ యాగం చేస్తారని పండితులు వెల్లడించారు. సీఎం కేసీఆర్ గత ఎన్నికలకు ముందు రాజ శ్యామల యాగం చేసి ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో విజేతగా నిలిచారు. ఎన్నికల విజయం తరువాత సహస్ర చండీ యాగం చేశారు. బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న సందర్భంలోనూ ఢిల్లీలో యాగం నిర్వహించారు. కేసీఆర్ యాగం చేసిన ప్రతిసారీ అందుకు ప్రతిఫలం పొందారని..ఈ సారికూడా రాజ శ్యామల యాగం ద్వారా మూడోసారి అధికారం చేజిక్కించుకుంటారని పార్టీ వర్గాల విశ్వాసం. 

Tags:    

Similar News