Godavari Floods: గోదావరి వరదల వెనుక క్లౌడ్ బరస్ట్ కుట్రలు.. సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..

Godavari Floods: గోదావరి వరదలపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2022-07-17 08:01 GMT
CM KCR on Cloud Burst at Bhadrachalam Floods

Godavari Floods: గోదావరి వరదల వెనుక క్లౌడ్ బరస్ట్ కుట్రలు.. సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..

  • whatsapp icon

Godavari Floods: గోదావరి వరదలపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని వెనుక కుట్రలు ఉన్నాయని, క్లౌడ్ బరస్ట్ జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. ఇతర దేశాల వాళ్లు కుట్రలు చేస్తున్నారని, గతంలో లేహ్‌, ఉత్తరాఖండ్‌లో ఇలాగే క్లౌడ్ బరస్ట్ చేశారని ఆరోపించారు. ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ చేస్తున్నట్లుగా తమకు సమాచారం వచ్చిందని కేసీఆర్ అన్నారు.

గోదావరి వరదకు శాశ్వత పరిష్కారం కావాలన్నారు సీఎం కేసీఆర్. భద్రాచలం ముంపు బాధితులకు శాశ్వత కాలనీలు నిర్మిస్తామని చెప్పారు. శాశ్వత కాలనీల కోసం ఎత్తైన ప్రదేశాలను గుర్తించాలని అన్నారు. వరదలతో ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. వరద బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించారు కేసీఆర్. ఒక్కో కుటుంబానికి 10 వేల రూపాయలు అందిస్తామని చెప్పారు. ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం అందించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.జూలై చివరు వరకు భారీ వర్షాలు ఉంటాయని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ సూచించారు.

Tags:    

Similar News