CM KCR: ప్రధాని మోడీ చెప్పెదొకటి.. చేసేదొకటి

CM KCR: విద్యుత్ సంస్కరణలు చేసేలా రాష్ట్రాలపై ఒత్తిడి చేస్తోంది

Update: 2022-02-13 14:00 GMT

CM KCR: ప్రధాని మోడీ చెప్పెదొకటి.. చేసేదొకటి

CM KCR: ప్రధాని నరేంద్ర మోదీ చెప్పేదొకటి చేసేదొకటి అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరోపించారు. ప్రగతిభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలపై మరోసారి విమర్శలు గుప్పించారు. విద్యుత్‌ సంస్కరణలు తెస్తున్నారు. అందులో భాగంగా ముసాయిదా బిల్లును వివిధ రాష్ట్రాలకు పంపించారు. ఆ బిల్లుపై 7-8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ అభిప్రాయాలను కూడా చెప్పారు. బిల్లు ఆమోదానికి ముందే రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు.

విద్యుత్‌ సంస్కరణలు వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించాం. సంస్కరణలు అమలు చేస్తే అరశాతం ఎఫ్ఆర్‌బీఎం ఐదేళ్ల పాటు ఇస్తామన్నారు. విద్యుత్‌ సంస్కరణలకు అదనపు రుణాలు తీసుకుంటున్నారు. అదనపు రుణాల విషయమై కేంద్ర బడ్జెట్‌లో కూడా చెప్పారు. కేంద్ర ముసాయిదా బిల్లుకు ఏపీ అంగీకరించింది. శ్రీకాకుళం జిల్లాలో 25వేల వ్యవసాయ మోటార్లకు మీటర్లు కూడా పెట్టారు. మిగతా విద్యుత్‌ మీటర్లకు రూ.737 కోట్లతో టెండర్లు పిలిచారు. కేంద్రం చెప్పినట్టు విద్యుత్‌ సంస్కరణలు అమలు చేయకపోతే తెలంగాణ రాష్ట్రం ఐదేళ్లలో రూ.25వేల కోట్లు నష్టపోయే అవకాశముంది.

అయినా సరే, మోటార్లకు మీటర్లు పెట్టబోమని స్పష్టంగా చెప్పాం. చరిత్రను కప్పిపుచ్చి భాజపా నేతలు గోల్‌మాల్‌ చేస్తున్నారు. బహిరంగ సభల్లో అన్ని విషయాలు చెప్పలేం. విద్యుత్‌ సంస్కరణలు అమలు చేయమని కేంద్రం చెప్పినట్టు నిరూపిస్తే క్షమాపణ చెబుతానని బండి సంజయ్‌ అన్నారు. ఇవిగో ఆధారాలు. బండి సంజయ్‌ క్షమాపణ చెప్పాలి. సాగుకోసం కొత్త విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వకూడదనేది కేంద్ర విధానం. వందశాతం మీటరింగ్‌పై డిస్కంలు చర్యలు తీసుకోవాలన్నారు. వినియోగదారులకు ఏడాదిలోగా విద్యుత్‌మీటర్లు పెట్టాలన్నారు అని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. 

Tags:    

Similar News