Nagarkurnool: బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ.. రాళ్లు, కర్రలతో పరస్పరం దాడు
Nagarkurnool: నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఉద్రిక్తత
Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లాలోని అచ్చంపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శనివారం అర్థరాత్రి బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తన కారులో డబ్బులు తరలిస్తున్నారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తూ.. ఆందోళనకు దిగారు. అలాగే ఎమ్మెల్యే కారును అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వెంటనే సమాచారమందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఇరుపార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు.
కాగా ఇరుపార్టీల కార్యకర్తల ఘర్షణలో ఎమ్మెల్యే బాలరాజుకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను అక్కడినుంచి ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ కార్యకర్తలు తనపై దాడి చేశారంటూ స్థానిక పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే బాలరాజు ఫిర్యాదు చేశారు.