బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ!

ఆదివారం బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ నెలకొంది. ప్రచారానికి వెళ్లిన బీజేపీ కార్యకర్తలను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది.

Update: 2020-11-22 09:49 GMT

గ్రేటర్‌ ఎన్నికలకి మొన్నటితో నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టాయి. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ జోరుగా ప్రచారం చేస్తోంది. ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌లో ఆదివారం బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ నెలకొంది. ప్రచారానికి వెళ్లిన బీజేపీ కార్యకర్తలను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది.

ఈ క్రమంలో బీజేపీ ప్రచార వాహనం అద్దాలు ధ్వంసం చేశారని ఆపార్టీ కార్యకర్తలు ఆరోపించారు. అంతేకాకుండా బాబుల్‌రెడ్డి నగర్‌లో ప్రచారం చేయెద్దని టీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారని తెలిపారు. ఈ విషయం పైన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు.

అటు జీహెచ్ఎంసీ ఎన్నికలకి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ నిన్న ముగిసింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు 90 నామినేషన్లను తిరస్కరించారు. మొత్తం వెయ్యి 8వందల 93 మంది అభ్యర్థులు 2వేల 5వందల 75 నామినేషన్లను దాఖలు చేశారు. ఇందులో బీజేపీ నుంచి 539, టీఆర్ఎస్ నుంచి 527, కాంగ్రెస్ నుంచి 348 మంది, టీడీపీ నుంచి 202 మంది అభ్యర్థులు బరిలో నిలిచి ఉన్నారు. వీరితోపాటు 613 మంది ఇండిపెండెట్లు నామినేషన్ దాఖలు చేశారు.

ఇక ఇప్పటికే జీహెచ్ఎంసీ షెడ్యుల్ రాగా, డిసెంబర్ 01న పోలింగ్ జరగనుంది. 04 న ఫలితాలు రానున్నాయి. ఉదయం ఏడూ గంటల నుంచి ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాలు మొదలు పెట్టేశాయి.

Tags:    

Similar News