CMRF: సీఎం రేవంత్‌కు విరాళం అందజేసిన చిరంజీవి
రామ్‌చరణ్ తరపున మరో 50 లక్షల రూపాయల చెక్కు సమర్పణ
CMRF: వరదలతో నష్టపోయిన తెలంగాణను ఆదుకునేందుకు పలు రంగాలకు చెందిన ప్రముఖులు విరాళాలు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే సీఎం రిలీఫ్ ఫండ్‌కు 50 లక్షల రూపాయల చెక్కును సీఎం రేవంత్‌రెడ్డికి అందజేశారు మెగాస్టార్ చిరంజీవి. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో రేవంత్‌రెడ్డిని కలిశారు చిరంజీవి. ఈ సందర్భంగా ఆయన తనయుడు రామ్‌చరణ్ తరపున మరో 50 లక్షల చెక్‌ను కూడా సీఎంకు అందించారు.
ఇక అమర్‌రాజా గ్రూప్ తరపున సీఎం రిలీఫ్ ఫండ్‌కు మాజీ మంత్రి గల్లా అరుణకుమారి కోటి రూపాయల విరాళం అందించారు. టాలీవుడ్ నుంచి నటులు విశ్వక్‌సేన్, సాయిధరమ్‌తేజ్ 10 లక్షల చొప్పున, నటుడు అలీ 3 లక్షల రూపాయల చెక్కులను సీఎంకు అందజేశారు.