KCR: రేపు సాయంత్రం ఢిల్లీకి సీఎం కేసీఆర్
* మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్న సీఎం * అమిత్‌షా భేటీ కానున్న సీఎం కేసీఆర్
KCR: రేపు సాయంత్రం మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం కేసీఆర్ ఈ సారి మూడు రోజుల పాటు హస్తినలోనే ఉండనున్నట్టు తెలుస్తోంది. కేంద్రం హోంమంత్రి అమిత్‌షా తో పాటు పలువురు కేంద్రమంత్రులతో సీఎం భేటీ కానున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేసీఆర్ సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశం మొదటి రోజు వాయిదాపడ్డ తర్వాత రేపు మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించనున్నట్టు తెలుస్తోంది ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లనున్నారు ఇటీవల హస్తినలో వారం రోజుల పాటు ఉన్నారు. ఇప్పుడు మరో ఢిల్లీకి వెళ్లడంపై సర్వత్రా ఆసక్తి రేపుతోంది.
ఈనెల 26న ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో హోంశాఖ అమిత్‌షా నేతృత్వంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమావేశం జరగనుంది. ఇందులో ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సీఎంలు పాల్గొననున్నారు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలు, అభివృద్ధి పనులను సమీక్షించనున్నారు. ఈ అంశాలపై కేంద్ర హోంశాఖ మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమావేశం ఏర్పాటు చేసింది.