Runamafi List: రైతు రుణమాఫీలో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి
Runamafi List: తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ గురువారం విడుదల చేసిన రుణమాఫీ లబ్దిదారుల జాబితాలో చాలా మంది రైతుల పేర్లు లేదు. దీంతో వారిలో అయోమయం నెలకొంది. రూ. లక్షలోపు పంట రుణం పొందిన రైతులు సంతోషంతో ఉంటే కొందరు రైతులు మాత్రం ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
Runamafi List: తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ గురువారం విడుదల చేసిన రుణమాఫీ లబ్దిదారుల జాబితాలో చాలా మంది రైతుల పేర్లు లేదు. దీంతో వారిలో అయోమయం నెలకొంది. రూ. లక్షలోపు పంట రుణం పొందిన రైతులు సంతోషంతో ఉంటే కొందరు రైతులు మాత్రం ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. దీంతో శుక్రవారం పలువురు రైతులు బ్యాంకులు, వ్యవసాయ అధికారులు, ఇతర అధికారులు చుట్టూ తిరిగారు. తెలంగాణలోని ప్రతి జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకున్నట్లు తెలుస్తోంది.
అటు సిద్ధిపేట జిల్లా తొగుట మండటం వెంకట్రావుపేట కు చెందిన ఓ రైతు రైతు రుణమాఫీ విషయం గురించి తన ఆవేదన వ్యక్తం చేశారు.తనకు ఎకరన్నర పొలం ఉండటంతో కేవలం రూ. 80వేలు మాత్రమే పంట రుణం తీసుకున్నాను అని చెప్పారు. తన భార్యకు ఎలాంటి రుణం అందలేదన్నారు. అయితే లబ్దిదారుల జాబితాలో తన పేరు కనిపించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. తన పేరు రెండో జాబితాలో కూడా వస్తుందో లేదో అని ఆందోళన చెందుతున్నాడు.
లబ్దిదారుల జాబితాలో పేర్లు ఉన్న కొంతమంది రైతులకు సాయం అందించడంతో ప్రభుత్వం సాయంత్రానికి మెజార్టీ రైతులకు సొమ్మును వారి ఖాతాలో జమచేసింది. వ్యవసాయ శాఖ అధికారులు రైతుల నుంచి ఫిర్యాదులు, ఫోన్స్ కాల్స్ వస్తున్నా రైతు సందేహాలను నివ్రుత్తి చేయలేకపోతున్నారు. రేషన్ కార్డు ఉన్నా చాలా మంది రైతులు రుణమాఫీ ప్రయజనం పొందలేకపోయారని రైతులు చెబుతున్నారు. సంగారెడ్డి, సిద్ధిపేట, మెదక్ జిల్లాల యంత్రాంగం టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసి రైతులు తమ వ్యవసాయ అధికారులు లేదా మండల వ్యవసాయ అధికారులు లేదా జిల్లా వ్యవసాయ అధికారుల ద్వారా ఫిర్యాదులు, వివరణలు పొందాలని సూచించారు.
వ్యవసాయ అధికారులు లబ్దిదారుల డేటాలోకి లాగిన్ ఇచ్చారు కాబట్టి ఏఈవోలు వారి స్థితిని తెలుసుకునేందుకు డేటాను యాక్సెస్ చేసుకోవచ్చు. రైతులు పెద్దెత్తున బ్యాంకుల దగ్గరకు చేరుకోవడంతో జిల్లా వ్యాప్తంగా బ్యాంకులు రద్దీగా మారాయి. అయితే వ్యవసాయ అధికారులు మాత్రం అర్హులైన రైతులందరికీ రుణమాఫీచేస్తామని చెప్పారు. అయితే రుణమాఫీలో మీరు అర్హులుగా ఉన్నారా లేదా అనే వివరాలను https://clw.telangana.gov.in/Login.aspx వెబ్ సైట్లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.