బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో మరో ట్విస్ట్‌

* కిడ్నాప్‌ వ్యవహారంలో విఖ్యాత్‌ ప్రమేయం ఉన్నట్టు ఆధారాలు * సీసీ ఫుటేజ్‌, కాల్‌ డేటా ఆధారంగా పోలీసుల నిర్ధారణ

Update: 2021-01-14 11:12 GMT

jagat vikhyat (file image)

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. అఖిలప్రియ సోదరుడు జగత్‌ విఖ్యాత్‌ రెడ్డిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. కిడ్నాప్‌ వ్యవహారంలో విఖ్యాత్‌ ప్రమేయం కూడా ఉన్నట్టు సీసీ ఫుటేజీ, కాల్‌ డేటా ఆధారంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మరోవైపు ఈ కేసులో ఏ1గా ఉన్న అఖిలప్రియను చంచల్‌గూడ జైలుకు తరలించారు. 

బోయిన్‌పల్లి కేసులో ఏ1గా ఉన్న మాజీమంత్రి అఖిలప్రియకు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్ విధించారు న్యాయమూర్తి. బెయిల్‌ ఇవ్వాలని కోర్టును అఖిలప్రియ తరపు న్యాయవాది కోరారు. బెయిల్‌ పిటిషన్‌పై సికింద్రాబాద్‌ కోర్టు శనివారం విచారణ చేపట్టనుంది. దీంతో అఖిలప్రియను చంచల్‌గూడ జైలుకు తరలించారు పోలీసులు. 

Tags:    

Similar News