నేడు తెలంగాణలో కేంద్ర బృందం పర్యటన.. వరద నష్టంపై అంచనా
Central Team: మొత్తం 8 శాఖల అధికారులతో తెలంగాణకు కేంద్ర బృందం
Central Team: తెలంగాణలో వరద నష్టాన్ని అంచనా వేయటానికి కేంద్ర అధికారుల బృందం ఇవాళ రాష్ట్రంలో పర్యటించనుంది. తీవ్రస్థాయిలో కురిసిన వర్షాల కారణంగా.. పెద్ద ఎత్తున ఏర్పడిన వరదల మూలంగా అనేక జిల్లాల్లో నష్టాన్ని, పరిశీలించనున్నారు. వివిధ మంత్రిత్వ శాఖల అధికారులతో కూడిన కేంద్ర అధికారుల బృందాన్ని తెలంగాణలో పర్యటించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఈ అధికారుల బృందానికి నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ సలహాదారుడు శ్రీ కునాల్ సత్యార్థి నాయకత్వం వహించనున్నారు.
కేంద్ర అధికారుల బృందం ఇవాళ తెలంగాణలో పర్యటించనుంది. భారీ వర్షాల కారణంగా సంభవించిన వరద ప్రాంతాల్లో జరిగిన నష్టంపై కేంద్ర అధికారుల బృందం సందర్శించి జరిగిన నష్టాన్ని అంచనా వేయనుంది. ప్రభుత్వం అందించనున్న వివరాలను కూడా జతపరుస్తూ... కేంద్ర అధికారుల బృందం నివేదిక తయారుచేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది.